Coach Restaurant: రైల్వే స్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coach Restaurant: ఇటీవల రెస్టారెంట్లు సాధారణంగా ఉంటే కస్టమర్లకు నచ్చడం లేదు. అందుకే ప్లాట్‌ఫామ్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్ వంటి యాంబియెన్స్ ఉంటే అలాంటి రెస్టారెంట్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందుకే దక్షిణ మధ్య రైల్వే వినూత్నంగా ఆలోచించి ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరు రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్‌ను దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రారంభించారు. రైలు పట్టాలను ఏర్పాటు చేసి వాటిపై స్లీపర్ కోచ్‌ను పూర్తి ఏసీ సదుపాయంతో రెస్టారెంట్‌గా డిజైన్ చేశారు. ఏపీలో రైల్వే కోచ్ రెస్టారెంట్ ఇదే మొదటిది అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: Army Dog Zoom: బుల్లెట్లు దూసుకెళ్లినా.. ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడింది
Also Read
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. 'పితృసమాన నేతను కోల్పోయాం'
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
కాగా ఈ రెస్టారెంట్‌లో రుచికరమైన ఆహారం దొరుకుతుందని.. రైలు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా ఈ రెస్టారెంట్‌లో రుచుల్ని ఆస్వాదించవచ్చని అధికారులు తెలిపారు. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారంతో ఈ రెస్టారెంట్‌లో విభిన్న వంటకాలతో కూడిన ప్రీమియం భోజన అనుభవాన్ని పొందవచ్చన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే ప్రజల సౌలభ్యం కోసం ఈ రెస్టారెంట్‌లో 24 గంటల సేవలు అందుతాయని ప్రకటించారు. వాడుకలో లేని రైల్వే స్లీపర్ కోచ్‌ను ఇలా రెస్టారెంట్ కోసం ఉపయోగించామని.. ప్రయాణికులకు ఈ రెస్టారెంట్ నూతన అనుభవనాన్ని ఇస్తుందని డీఆర్ఎం మోహన్‌రాజా వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లైసెన్స్ మంజూరు చేయడం ద్వారా కోచ్ రెస్టారెంట్ కాన్సెప్ట్‌ను వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
As part of providing enhanced passenger services & novel experience to the rail users, SCR has conceptualized an innovative idea by starting a Coach restaurant in the circulating area of Guntur Railway station. @RailMinIndia @drmgnt@pibvijayawada #ResturantOnWheels pic.twitter.com/VfBtYSD7u7
— South Central Railway (@SCRailwayIndia) October 11, 2022
తాజావార్తలు
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!