Coach Restaurant: ఇటీవల రెస్టారెంట్లు సాధారణంగా ఉంటే కస్టమర్లకు నచ్చడం లేదు. అందుకే ప్లాట్‌ఫామ్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్ వంటి యాంబియెన్స్ ఉంటే అలాంటి రెస్టారెంట్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందుకే దక్షిణ మధ్య రైల్వే వినూత్నంగా ఆలోచించి ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరు రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్‌ను దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రారంభించారు. రైలు పట్టాలను ఏర్పాటు చేసి వాటిపై స్లీపర్ కోచ్‌ను పూర్తి ఏసీ సదుపాయంతో రెస్టారెంట్‌గా…