ఏపీలో ఎఫ్‌డీల స్కామ్‌లో ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్, ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ లలో 14 కోట్ల రూపాయల ఎఫ్‌డీల స్కాంల గల్లంతు కేసులో అరెస్టులు జరిగాయి. గిడ్డంగుల శాఖ కేసులో IOBబ్యాంక్ అప్పటి మేనేజర్ జి.సందీప్ కుమార్ అరెస్టయ్యారు.
ఆయిల్ ఫెడ్ నిధుల దుర్వినియోగం కేసులో పూసలపాటి యోహాన్ రాజు అరెస్ట్ అయ్యారు. స్కామ్ లో భాగస్వాములుగా ఉన్న మరో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు.
తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన వారిని పీటీ వారెంట్లపై కోర్ట్ లో హాజరు పరచనున్నారు ఏపీ పోలీసులు. ఆయా బ్యాంకుల నుంచి కొట్టేసిన 14 కోట్లను వివిధ అకౌంట్లకు తరలించారు నిందితులు. బ్యాంక్ అకౌంట్ లో ప్రస్తుతం ఉన్న 77 లక్షలను స్తంభింపజేశారు పోలీసులు. హవాలా ద్వారా కోట్ల నిధులను దారిమళ్లించినట్లు గుర్తించారు పోలీసులు.