NTV Telugu Site icon

Honor Killing: ఏపీలో పరువుహత్య.. కూతుర్ని దారుణంగా చంపిన తండ్రి

Honor Killing

Honor Killing

Father Killed His Daughter In Nandyal District Because Of Extramarital Affair: ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కన్న కూతురినే ఓ తండ్రి అత్యంత కిరాతకంగా చంపేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే ఆ తండ్రి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేందర్ రెడ్డికి ప్రసన్న అనే కుమార్తె ఉంది. ఈమెకు 18 నెలల క్రితం గోస్పాడు మండలం జిల్లెల్లకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. తన భర్తతో కలిసి హైదరాబాద్‌కి వచ్చిన ప్రసన్న.. నగరంలో కాపురం పెట్టింది. అయితే.. భర్తతో మనస్పర్థలు ఏర్పడటంతో ప్రసన్న పుట్టింటికి తిరిగొచ్చింది.

China Bumper Offer: కొత్త జంటలకు చైనా బంపరాఫర్.. నెల రోజులు ఫ్రీ

రోజులు గడుస్తున్నా ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లకపోవడంతో.. కాపురానికి వెళ్లాల్సిందిగా దేవేందర్ రెడ్డి చాలాసార్లు నచ్చజెప్పాడు. ఎన్ని గొడవలు జరిగినా, సర్దుబాటు చేసుకోవాలని చెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా పట్టించుకోకుండా ప్రసన్న పుట్టింట్లోనే ఉండిపోయింది. దీంతో తండ్రికి అనుమానం వచ్చింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని, అందుకే భర్త వద్దకు వెళ్లకుండా పుట్టింట్లోనే ఉందని అనుమానం కలిగింది. దీంతో.. కూతురిని చంపేయాలని దేవేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 10వ తేదీన రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు.. ప్రసన్న గొంతు నులిమి చంపేశాడు. కొందరి సహాయంతో ప్రసన్న మృతదేహాన్ని నంద్యాల-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని పచ్చర్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు.. తల, మొండెను వేరు చేశాడు. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.

Bandi Sanjay: బీఆర్ఎస్‌ను తరిమికొడదాం.. రామరాజ్యం స్థాపించుకుందాం

ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో.. పాణ్యం పోలీసులు రంగంలోకి దిగారు. కుళ్లి కంపు కొడుతున్న మృతదేహం, శిథిలాలను సేకరించి.. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి దేవేందర్ రెడ్డినే కూతుర్ని హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. దీంతో.. దేవేందర్‌తో పాటు అతనికి సహకరించిన మరికొందరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. మరొకరితో తన కూతురు వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే తాను చంపేశానని విచారణలో దేవేందర్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.