Site icon NTV Telugu

Vijay Sai Reddy: లిక్కర్ కేసులో నేడు సిట్ విచారణకు విజయ సాయిరెడ్డి..

Vsr

Vsr

Vijay Sai Reddy: గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని తేలింది. దీనిపై విచారణ జరిపిన సిట్ అధికారులు.. పలు ఆధారాలను కూడా సేకరించారు. ఈ వ్యవహారం మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారిగా, ఆయన కనుసన్నల్లోనే కుంభకోణం నడిచిందని నిర్ధారించుకున్నారు. అయితే ఇప్పటికే మూడు సార్లు విచారణకు రావాలని కసిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు, కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తుంది. ఆయన ఫ్యామిలీని కలిసి నోటీసులు అందజేశారు. అలాగే కసిరెడ్డి తండ్రి ఉపేందర్ కి సైతం నోటీసులు అందజేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రేపు విచారణకు రావాలని ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.. విచారణలో న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని కోరారు.

Read Also: MI vs SRH: మెరిసిన జాక్స్, రికిల్‌టన్‌.. సన్‌రైజర్స్‌పై ముంబై విజయం! ప్లేఆఫ్స్‌ రేసులో ఎంఐ

అయితే, మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (ఏప్రిల్ 18న) విచారణకు రావాల్సిందిగా సూచించారు. విచారణకు వచ్చి తన దగ్గర ఉన్న వివరాలు ఇవ్వాల్సిందిగా అతడిని సిట్ కోరింది. దీంతో ఇవాళ విజయవాడలోని సిట్ ఆఫీసు దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ విచారణలో ఎలాంటి విషయాలను సిట్ విజయ సాయిరెడ్డిని అడుగుతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version