Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. పార్టీలు మారే నేతల సంఖ్య కూడా పెరుగుతోంది.. జనసేన పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధం అవుతున్నారు.. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆదివారం రోజు పార్టీ కండువా కప్పుకోబోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, టీవీ రామారావు.. ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు.. అనుచరులతో చర్చించిన తర్వాత జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. దానికి అనుగుణంగా రేపు.. జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు..
Read Also: Somu Veerraju: కీలక నేతలు బీజేపీలోకి.. పవన్-కిరణ్ కాంబినేషన్‌పై అధిష్టానానిదే నిర్ణయం..!
ఇక, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు కూడా ఆదివారం రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు.. రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.. 1994లో తొలిసారి ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఈదర హరిబాబు.. ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదు. అయితే, 2014లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇక, 2019లో తన తనయుడితో కలిసి ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది.