NTV Telugu Site icon

Kodali Nani: ఎన్టీఆర్ కి పార్టీ ఇచ్చేసి చంద్రబాబు, లోకేష్ తప్పుకోవాలి

Jr Ntr Nani

Jr Ntr Nani

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, లోకేష్ పార్టీలపై తనదైన రీతిలో కామెంట్లు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ పేరు పది కాలాలపాటు వినిపించాలంటే పార్టీ బాధ్యతలు జూనియర్ కు ఇవ్వాలన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆరును లోకేష్ ఆహ్వానించడమేంటీ..?చంద్రబాబు, లోకేష్ కు నిశ్వసనీయత లేదు.పార్టీని కాపాడ్డం తమ వల్ల కాదని చంద్రబాబు, లోకేషుకు అర్థమైంది.

Read Also: Akshay Kumar: పఠాన్ తో ఇండస్ట్రీ కోలుకుందనేది అబద్దం… ‘సెల్ఫీ’ ఊహించని ట్విస్ట్

తమ విశ్వసనీయతపై తమకే నమ్మకం లేక.. జూనియర్ ఎన్టీఆరుని లోకేష్ ఆహ్వానించారు.పార్టీ బాధ్యతలు జూనియర్ కు అప్పజెబితే టీడీపీ ప్రతిపక్షంలోనైనా ఉంటుంది.తెలుగుదేశం పార్టీ ఊబి లాంటిది.. ఆ పార్టీని కాపాడేందుకు ఎవరెళ్లినా కూరుకుపోవడం ఖాయం.ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రు, చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి, లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో పార్టీని గెలిపించలేని వాళ్లు.. టీడీపీని ఏం రన్ చేస్తారు.మార్పు కావాల్సింది టీడీపీలోనే.. రాష్ట్రంలో కాదు.

మంగళగిరిలో లోకేష్ తరపున బ్రహ్మాణి ప్రచారం చేసినా ఓడిపోయాడు.కానీ బ్రాహ్మణినే పోటీ చేసుంటే గెలిచేవారు.లోకేష్ కు విశ్వసనీయత లేదు.తనను వాడుకుని ఆ తర్వాత ఎలా అవమానించారో జూనియర్ కు తెలీదా..?2009 తర్వాత జరిగిన మాహానాడులో లోకేష్ కోసం జూనియర్ ను అవమానించారు.2014 ఎన్నికల్లో గెలిచాక ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమంలో జూనియర్ ను గ్యాలరీలో కూర్చొబెట్టి అవమానించారు.చంద్రబాబు ఎలాంటి వాడో తన తాత, తండ్రి, మేనత్తలు చెప్పింది జూనియర్ వినే ఉంటాడు.చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో స్వయంగా జూనియర్ ఫేస్ చేశాడు.

Read Also: UPI LITE Payments: రూ.200 లోపు చెల్లింపులకు యూపీఐ లైట్‌ని ఇలా వాడాలి