2018 మిడ్ నుంచి బాలీవుడ్ కష్టాల్లో ఉంది, అక్కడి స్టార్ హీరోల సినిమాలు హిట్ అవ్వకపోవడంతో రెవెన్యు రొటేట్ అవ్వక ట్రేడ్ పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి సమయంలో సుశాంత్ మరణం, నెపోటిజం, కోవిడ్ పీరియడ్, బాయ్కాట్ ట్రెండ్, బాలీవుడ్ ని కోలుకోలేని దెబ్బ తీసాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. ముఖ్యంగా 2021, 2022 హిందీ బాక్సాఫీస్ ని సౌత్ సినిమాలు ఏలాయి. ఇక బాలీవుడ్ కోలుకోవడం కష్టం, ఇప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదు సౌత్ సినిమా అనే మాట వినిపించడం మొదలయ్యింది. ఇలాంటి సమయంలో వెంటిలేటర్ పై ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకి కొత్త ఊపిరి పోశాడు షారుఖ్ ఖాన్. అయిదేళ్లుగా సినిమా చెయ్యని షారుఖ్, బాలీవుడ్ కష్టాలు తీరుస్తూ ‘పఠాన్’ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. నెల రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి, బాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులని బ్రేక్ చేస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు షారుఖ్ ఖాన్. ట్రేడ్ రివైవ్ అవ్వడంతో పఠాన్ సినిమా బాలీవుడ్ కి సేవియర్ ప్రాజెక్ట్ అయ్యింది, ఇకపై ఇండస్ట్రీ బాగుంటుంది అనే మాటలు వినిపించాయి.
నిజానికి గ్రౌండ్ లెవల్ రియాలిటీ వేరేగా ఉంది. పఠాన్ ఎప్పుడో ఒకసారి జరిగే అద్భుతం మాత్రమే, రియాలిటీ మాత్రం అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ సినిమాలా ఉంటుందని గుర్తు చేసింది. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’కి రీమేక్ గా హిందీలో తెరకెక్కిన సినిమా ‘సెల్ఫీ’. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ మెయిన్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి వచ్చింది. మంచి కథతో తెరకెక్కిన సెల్ఫీ సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, అక్షయ్ కుమార్ హిట్ కొడతాడు అనుకుంటే ట్రేడ్ వర్గాలకి దిమ్మతిరిగి పోయే షాక్ ఇస్తూ మొదటి రోజు కేవలం 2 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమే రాబట్టింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హేఒర్ సినిమా మొదటి రోజు 2 కోట్లు మాత్రమే రాబట్టింది అంటే అది దారుణమైన విషయం. మరి నార్త్ ఆడియన్స్ రీమేక్ సినిమాలని చూడడానికి రెడీగా లేరో? అక్షయ్ కుమార్ పై నెగిటివిటి ఉందో? లేక పఠాన్ జోష్ ఇంకా కొనసాగుతుందో తెలియదు కానీ సెల్ఫీ సినిమా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకి, దర్శక నిర్మాతలకి షాక్ వేవ్స్ ఇస్తుంది.