Kannababu: మాకు బాలకృష్ణ తక్కువ కాదు.. చిరంజీవి ఎక్కువ కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannababu: రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది.. దీనిపై విమపక్షాలు మండిపడుతున్నాయి.. ఇదే సమయంలో.. ఇద్దరు పెద్ద హీరోల సినిమా ఈవెంట్లు రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించారు.. కానీ, ప్రభుత్వ ఆంక్షలతో ఒంగోలులో నిర్వహించే వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. మరోవైపు, విశాఖ వేదికగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక కూడా మార్పు చేశారు.. ముందుగా వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గర వేదిక ఫిక్స్ చేయగా అక్కడ అధికారుల నుండి అనుమతి రాలేదు. దీంతో ఈ వేదికను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కి మార్చారు. అయితే ఇక్కడ నుండి కూడా వేదిక మారిపోయింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆర్కే బీచ్ లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబుకు ప్రశ్న ఎదురైంది.. దానిపై క్లారిటీ ఇచ్చిన ఆయన.. బాలకృష్ణ సినిమా ఫంక్షన్ లను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు..
Read Also: US House Speaker: ఎట్టకేలకు ప్రతినిధుల స్పీకర్‌గా కెవిన్ మెక్‌కార్తీ ఎన్నిక
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
చిరంజీవి మూవీ ఫంక్షన్ కి ఆర్కే బీచ్ లో నిబంధనలు ప్రకారం అనుమతులు ఇచ్చి ఉంటారని తెలిపారు కన్నబాబు.. అంతేకానీ, మాకు బాలకృష్ణ తక్కువ, చిరంజీవి ఎక్కువ కాదు.. రోడ్డు మీద సభలు పెట్టకూడదు అనేది జీవో ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇక, గతంలో ముద్రగడ పద్మనాభాన్ని ఏ చట్టం ప్రకారం నిర్బంధించారు, పరామర్శకి వస్తుంటే చిరంజీవిని రాజమండ్రిలో ఎందుకు అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు కన్నబాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచారం కోసం మనుషులు ప్రాణాలు తీస్తున్నాడని మండిపడ్డారు.. జీవో నెంబర్ 1 పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబుకి కొన్ని పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. అధికార దాహం తప్ప చంద్రబాబుకి ఏమీ లేదని ఆరోపించారు.. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు అంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. కందుకూరులో ఎవరు కుట్ర చేశారు.. అలా చెప్పడానికి సిగ్గు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కాపులు మీద వేల కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి కన్నబాబు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..