Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

  • ఆంధ్రప్రదేశ్‌లో ఘోరు రోడ్డుప్రమాదం..
  • ఏలూరు కలపరు టోల్‌గేట్‌ వద్ద లారీని ఢీకొన్న బస్సు..
  • మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం..
Road Accident

Road Accident

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోరు రోడ్డుప్రమాదం జరిగింది.. ఏలూరు కలపరు టోల్‌గేట్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. కలపరు టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో.. మహిళ మృతి చెందింది.. మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. దీంతో, వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 28 మంది కుటుంబ సభ్యుల బృందం బస్సులో ఉన్నట్టుగా చెబుతున్నారు.. చనిపోయిన మహిళా ముగడ కృష్ణమ్మ వయస్సు 60 ఏళ్లు.. పెద్దూరు గ్రామం గురుపల్లి మండలం పార్వతిపురం, మన్యం జిల్లాగా గుర్తించారు పోలీసులు.. ఇక, ఈ ప్రమాదంలో కేబినెట్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు పోలీసులు.

Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్లో విషాదం.. రైలు నుండి జారిపడి ఇద్దరు మృతి