Minister Kolusu Parthasarathy: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్‌.. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా..?

  • పేషెంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి?..
  • ఏలూరులో శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి..
  • ఏలూరు ఆర్.ఎం.ఓ కు మంత్రి సారథి సీరియస్ వార్నింగ్..
  • ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి పార్థసారథి సీరియస్..
Parthasarathy

Parthasarathy

Minister Kolusu Parthasarathy: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీబిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనపై ఆరాతీశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని, పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ పై మండిపడ్డారు.

Read Also: Stock Market: స్టాక్ మార్కెట్‌లో భారీ కుదుపు.. 1,000+ పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. నిఫ్టీ కూడా దిగువకు

తాజాగా, నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం, గోపవరం గ్రామానికి చెందిన మహిళ నాగలక్ష్మి డెలివరీ నిమిత్తం ఏలూరు జీజీహెచ్ లో చేరారు. నాగలక్ష్మికి డెలివరీ చేయాల్సిన డాక్టర్ అథియా డెలివరీ డేట్ ఇంకా రాలేదనే కారణంతో డెలివరీ ఆలస్యం చేశారని, దీంతో శిశువు మృతిచెందిందని నాగలక్ష్మీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ కు మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. శిశువు చనిపోయిన విషయాన్ని నాగలక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి, బాధ్యత లేకుండా వెళ్లిపోవడం ఏంటని నిలదీశారు? గతంలోనూ నూజివీడు నియోజకవర్గానికి చెందిన వారి విషయంలోనూ ఏలూరు జీజీహెచ్ సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని, తనకు నివేదిక ఇచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్.ఎం.ఓ ను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే ఎవర్నీ సహించేది లేదని తేల్చిచెప్పారు.