Site icon NTV Telugu

CM Jagan: వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక పథకాలు గుర్తు వస్తాయి..

Cm Jagan

Cm Jagan

ఏలూరు జిల్లా కైకలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావని పేర్కొన్నారు. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలు అన్నారు. జగన్కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని తెలిపారు. ఇంటింటి అభివృద్ది చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు. పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలు అన్నీ ముగింపేనని ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రజలు మోస పోవటమేనన్నారు. సాధ్యంకాని హామీలు ఇవ్వటం చంద్రబాబు అలవాటు.. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని అన్నారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి తాము చేశామని తెలిపారు. లంచం అనేది లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు.

Rishabh Pant Ban: బిగ్ బ్రేకింగ్.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్‌!

నెరవేర్చే హామీలు మాత్రమే వైసీపీ మేనిఫెస్టోలో పెట్టింది.. వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక పథకాలు గుర్తు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఇళ్ల పట్టాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలా అనేక పథకాలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఇంటి వద్దకే పౌర సేవలు అందించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను ఆపేశాడని.. తనకు మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో చంద్రబాబు పెన్షన్లు అందకుండా చేస్తున్నాడని విమర్శించారు. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లు భూములు కొనుక్కున్నారని.. వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్‌లు ఇచ్చామా, లేదంటే జిరాక్స్ కాపీలు ఇచ్చామా అంటూ ప్రశ్నించారు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు, ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని సీఎం జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Chandrababu: వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్.. తప్పుడు రాజకీయం అంటూ బాబు ఘాటు వ్యాఖ్యలు!

Exit mobile version