Body Builders Fighting: అసలే బాడీ బిల్డర్స్.. గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు..!
- ఏలూరు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు..
- మిస్టర్ ఆంధ్ర పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు..
- బాడీ బిల్డర్స్ మధ్య చిన్న వివాదం..
- గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్న వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Body Builders Fighting: ఎవరైనా వీఐపీలు వచ్చినా.. ఏ ఫిల్మ్సార్ట్ ఎంట్రీ ఇచ్చినా.. ఇలా ప్రముఖులు వచ్చిన సమయంలో.. సామాన్య ప్రజలు, ఫ్యాన్స్ నుంచి రక్షణా బాడీ బిల్డర్స్‌ను రంగంలోకి దింపుతారు.. కానీ, ఆ బిల్డర్స్ మధ్య ఏర్పడిన ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. తీవ్ర ఘర్షణకు దారి తీసింది.. ఏలూరులో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. ఏలూరు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్ర పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.. పోటీలకు విచ్చేసిన బాడీ బిల్డర్స్ గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలు కావడంతో, ఏలూరు ప్రభుత్వ వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు..
Read Also: Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి..
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
ఇక, సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరిని చెల్లా చెదురు చేశారు.. అయితే పోలీసులు వచ్చేసరికే ఘర్షణకు దిగిన వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఘర్షణకు కారణం అయినా విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని అక్కడ ఉన్నటువంటి వారిని పోలీసులు కోరారు.. సీఐ కోటేశ్వరరావు విద్యార్థులకు, పోటీలకు హాజరైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేశారు.. అనవసరంగా గొడవలకు దిగితే ఇబ్బందుల్లో పడుతారని హెచ్చరించారు.. పోలీసులు కేసులు నమోదైతే భవిష్యత్తు అంధకారమవుతుందని వార్నింగ్ ఇచ్చారు.. అయితే, పోలీసులు ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!