Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: మరోసారి ప్రతిపక్షంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత.. “మావిగన్ పేరు ఎత్తితేనే ప్రజలు నవ్వుకుంటున్నారు” అంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాల కంటే మాటలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆమె విమర్శించారు. వైసీపీ పాలనలో కనీసం ఒక ఫైర్ ఇంజన్ కూడా కొనుగోలు చేయలేదని ఆమె ఆరోపించారు. ప్రజా భద్రత వంటి ముఖ్య అంశాలను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Also: TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
- MP Putta Mahesh Kumar: తప్పు చేయలేదు.. నిర్దోషిగా నిరూపించుకుంటా..
గతంలో అవగాహనలేని నాయకులు ఇష్టానుసారం వ్యవహరించి కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తిన్నారని అనిత వ్యాఖ్యానించారు. ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి నాయకుల మార్గదర్శకత్వంలో విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగా మాత్రమే పనిచేస్తుందని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, అత్యాధునిక సౌకర్యాలను కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరులో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
-
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
-
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!