TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Laddu Sales Record: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసిద్ధ లడ్డూ ప్రసాదానికి ఆదరణ ఎప్పుడూ తగ్గదు.. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో విశ్వాసం.. తిరుమల వెళ్తున్నారంటే.. నాకు లడ్డూ తీసుకురా అని చెప్పే భక్తులు ఎంతో మంది.. అయితే, 2025–26 వార్షిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిపి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించింది టీటీడీ.. ఇక, లడ్డూల విక్రయం ద్వారా సుమారు రూ.567 కోట్లు ఆర్జించింది టీటీడీ.. రోజువారీగా సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేసి, అదే స్థాయిలో విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.
Read Also: Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
కాగా, శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత కూడా విశేషం. 1790 నుంచి 1840 మధ్య కాలంలో తిరుమల ఆలయంలో లడ్డూ తయారీ ప్రారంభమైంది. మరాఠా రాజు రఘోజి భోంస్లే పాలనలో స్వామివారికి లడ్డూ ప్రసాదం నివేదించే సంప్రదాయం మొదలైందని చరిత్ర చెబుతోంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల లడ్డూ, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు దర్శనం అనంతరం ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. టీటీడీ నిర్వహణలో లడ్డూ తయారీ, నాణ్యత, పంపిణీ ప్రక్రియలు అత్యంత శ్రద్ధతో కొనసాగుతున్నాయి. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కూడా సరిపడా లడ్డూలను అందించడంలో టీటీడీ సమర్థంగా పనిచేస్తోంది. ఈ రికార్డు విక్రయాలు తిరుమల దేవస్థానం నిర్వహణ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!