Tammineni Sitaram: ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని విమర్శించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆక్రమాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో లూటీలు గృహ దహనాలు మానభంగాలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇలాంటి పద్ధతులు కొనసాగితే మంచిది కాదని హితవు పలికారు. రెడ్ బుక్ రాజ్యాంగాలు పనికిరావని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని అన్నారు తమ్మినేని సీతారాం..
Read Also: AP Young Man Died in USA: అమెరికాలో ఏపీ యువకుడు మృతి.. మార్టూరులో విషాదం
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్‌లో కలిశారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఆయనతో పాటు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్.ఆర్ విశ్వనాథన్ , టీటీడీ బోర్డు మాజీ డైరెక్టర్ సి. విష్ణు రెడ్డి ఉన్నారు.. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి అన్నారు. నిర్దోషులను దోషులుగా చిత్రీకరించి జైల్లో పెడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి నిర్దోషి , కచ్చితంగా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకొని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు ? ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఏమీ పనికిరావని అన్నారు. ఇది ప్రభుత్వానికి పద్ధతి కాదని, దీనిని సీరియస్ గా పరిగణిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలపై అసెంబ్లీలో చర్చించడం ఎందుకు..? అంటూ ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో ప్రజలే చెప్తారని అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
