NTV Telugu Site icon

East Godavari: వడిశలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు.. భారీగా పాల్గొన్న ఔత్సాహికులు

East Godavari

East Godavari

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జి.ఎస్.ఎల్ సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర రావు ఆధ్వర్యంలో ఈ ఎడ్ల బండి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి ఔత్సాహికులు భారీగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఎడ్లబండ్ల పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని ప్రతిబంబిస్తూ.. ఈ రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలను ఘనంగా నిర్వహించారు.

Read Also: Viral News: ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన మామ.. పెళ్లి కూతురు ఇంటిపై విమానం నుంచి డబ్బుల వర్షం(వీడియో)

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గడిచిన 6 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాణం పోస్తూ.. ఈ పోటీలు కొనసాగుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా.. యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న తరుణంలో మన సంస్కృతి, సంప్రదాయాలను వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ఎడ్లబండి పోటీలకు ప్రతి ఏటా ఆదరణ పెరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల నలుమూలల నుండి 50కు పైగా ఔత్సాహికులు ఎడ్ల బండ్లతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎడ్ల బండి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Read Also: Kakinada: కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం.. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు

Show comments