Rajahmundry Milk Tragedy: కల్తీ పాల ఘటనలో సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry Milk Tragedy: రాజమండ్రిని వణికిస్తున్న కల్తీ పాల ఉదంతంలో దర్యాప్తు వేగవంతమైంది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఎస్పీ నరసింహ కిషోర్ కలిసి కోరుకొండ మండలం నరసాపురంలోని పాల కేంద్రాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
Read Also: Ather Rizta vs TVS iQube: రేంజ్, ఫీచర్లు.. బడ్జెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్?
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
వరలక్ష్మి డైరీ నుండి అడ్డాల గణేష్ అనే వ్యాపారి విక్రయించిన పాలలో, కేవలం ఒక పాల క్యాన్ మాత్రమే కల్తీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఆ ఒక్క క్యాన్ పాలు తాగిన వారే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కల్తీ పాలు సేవించడం వల్ల నలుగురు మృతి చెందినట్లు ఐజీ ధ్రువీకరించారు. ఇక, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలను పంపించామని, రిపోర్టులు వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, పరిస్థితి నియంత్రణలోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐజీ భరోసా ఇచ్చారు. అధికారులు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి పరిస్థితిని సమీక్షించారు. పాల ఉత్పత్తి నుండి పంపిణీ వరకు ఎక్కడ లోపం జరిగిందనే కోణంలో లోతైన విచారణ జరుగుతోంది.
తాజావార్తలు
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!