NTV Telugu Site icon

Road Accident: రాజమండ్రి సమీపంలో ట్రావెల్స్‌ బస్సు బోల్తా..

Rajahmundry

Rajahmundry

Road Accident: రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా… 20 మంది వరకూ గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ కు గత రాత్రి బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బోల్తా పడింది. బస్సు బోల్తాపడిన విషయం తెలిసేసరికి జాప్యం జరగడం, పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు క్షతగాత్రుల గంటపాటు విలవిల్లాడారు. రాజమహేంద్రవరం నుంచి ఆరు అంబులెన్సులు కాతేరు- కొంతమూరు మధ్య వంతెనపై ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం జీజీహెచ్ తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది.

Read Also: Nayanthara: నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న నయనతార మూవీ..?

వీరిలో 25 ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బోల్తాపడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని రక్షించారు. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే ఎందుకు వెళ్తున్న విశాఖకు చెందిన కళ్యాణి అనే యువతి ఘటనా స్థలంలోని మృతి చెందడంతో తీవ్ర విషాదంగా మారింది. ఘటనపై రాజమండ్రి టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.