రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా... 20 మంది వరకూ గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు గత రాత్రి బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బోల్తా పడింది.