Peddireddy Ramachandra Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రాకతో సెంట్రల్ జైలుకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని మరి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది.. ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
Read Also: Indian Passport: భారతీయులకు శుభవార్త.. ఇకపై 59 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్!
ఇక, టెర్రరిస్టులు మాదిరిగా వైసీపీ నేతలను ట్రీట్ చేస్తున్నారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నాం.. ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధన ప్రకారం సౌకర్యాలు కల్పించకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం మద్యం వినియోగాన్ని అదుపు చేసింది.. బెల్టు షాపులు లేకుండా, మద్యం అధిక ధరలకు విక్రయించి ప్రభుత్వానికి రెవెన్యూ పెంచింది.. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ. 25,700 కోట్లు ఆదాయం వచ్చింది.. 2014-19 మధ్యకాలంలో ప్రభుత్వానికి రూ. 17,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు.. డిస్టలరిలకు అనుమతులన్నీ చంద్రబాబే ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: HHVM : హరిహర వీరమల్లుపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్.. మాస్ పవర్
ఎంపీ మిథున్ రెడ్డి మీద బనాయించింది అక్రమ కేసు అని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపించేది.. మద్యం స్కామ్ పేరుతో ఎంపీ మిథున్ రెడ్డిని జైలు పాలు చేయటం దారుణం అని పేర్కొనింది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమా అరెస్టులపై పోరాటం చేస్తామని వెల్లడించింది.
