Peddireddy Ramachandra Reddy: ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది.. కూటమి ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫైర్!
- రాజమండ్రి సెంట్రల్ రిమాండ్‌లో ఎంపీ మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖాత్..
- పెద్దిరెడ్డి రాకతో సెంట్రల్ జైలకు భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు..
- వైసీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు.. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది..
- ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రాకతో సెంట్రల్ జైలుకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని మరి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది.. ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
Read Also: Indian Passport: భారతీయులకు శుభవార్త.. ఇకపై 59 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్!
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ఇక, టెర్రరిస్టులు మాదిరిగా వైసీపీ నేతలను ట్రీట్ చేస్తున్నారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నాం.. ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధన ప్రకారం సౌకర్యాలు కల్పించకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం మద్యం వినియోగాన్ని అదుపు చేసింది.. బెల్టు షాపులు లేకుండా, మద్యం అధిక ధరలకు విక్రయించి ప్రభుత్వానికి రెవెన్యూ పెంచింది.. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ. 25,700 కోట్లు ఆదాయం వచ్చింది.. 2014-19 మధ్యకాలంలో ప్రభుత్వానికి రూ. 17,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు.. డిస్టలరిలకు అనుమతులన్నీ చంద్రబాబే ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: HHVM : హరిహర వీరమల్లుపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్.. మాస్ పవర్
ఎంపీ మిథున్ రెడ్డి మీద బనాయించింది అక్రమ కేసు అని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపించేది.. మద్యం స్కామ్ పేరుతో ఎంపీ మిథున్ రెడ్డిని జైలు పాలు చేయటం దారుణం అని పేర్కొనింది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమా అరెస్టులపై పోరాటం చేస్తామని వెల్లడించింది.
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?