Site icon NTV Telugu

Minister Kandula Durgesh: టూరిజం రంగానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కల్యాణ్.. మరొకరు అవసరంలేదు..

Kandula Durgesh

Kandula Durgesh

Minister Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం రంగానికి బ్రాండ్‌ అంబాసిడర్.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మాకు మరో బ్రాండ్‌ అంబాసిడర్ అవసరంలేదన్నారు ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్.. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టూరిజం శాఖ అవినీతిమయమైందని ఆరోపించారు. ప్రక్షాళన చేయటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.. గత ప్రభుత్వానికి టూరిజం అధికారులు అనుకూలంగా వ్యవహరించి కోట్లాది రూపాయలు దోచేశారని విమర్శించారు. ఇక, పులివెందులలో 4స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు గుప్పించారు..

Read Also: Hathras: హత్రాస్‌ తొక్కిసలాటతో.. అలర్టైన మరో బాబా.. భక్తులకు ఏం చెప్పారంటే..!

ఇక, తెలుగు సినిమా రంగాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు మంత్రి కందుల.. ప్రైవేట్ మరియు పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్‌లో సినిమా రంగానికి మౌలిక వసతులు కల్పిస్తాం అన్నారు.. టూరిజం అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని కోరతాం అన్నారు మంతరి కందుల దుర్గేష్.. కాగా, తాజాగా, అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పోచమ్మ గండి వద్ద పాపికొండల పర్యాటక బోట్లను పరిశీలించిన మంత్రి.. పాపికొండలు వెళ్లి వచ్చిన టూరిస్టులతో బోట్ లో మాట్లాడుతూ.. వారి నుంచి సమస్యలు తెలుసుకున్న విషయం విదితమే.. అంతేకాదు.. సూచనలను కూడా స్వీకరించారు.. బోట్ భద్రత దృష్ట్యా అధికారులతో కలిసి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఏపీలో టూరిజం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని.. నదిపై పాపికొండలు పర్యటన చేసే వాళ్లకు.. పర్యాటకులకు అవసరమైన అన్ని సేవలను అందుబాటులో ఉంచుతామని మంత్రి కందుల దుర్గేష్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Exit mobile version