Undrajavaram Incident: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపరులో విషాదం చోటుచేసుకుంది. సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమాల్లో భాగంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. తెల్లవారుజామున ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా 11కేవివి వైర్ తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా రెండు వర్గాల మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో ఒకరికొకరు పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. అయితే, మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Wriddhiman Saha Retirement: క్రికెట్కు గుడ్ బై చెప్పిన టీమిండియా వికెట్ కీపర్
ఇక, ప్రమాదానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి దుర్గేష్.. మృతుల కుటుంబాలకు అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. అయితే, తొలి కార్తిక సోమవారం. అందరూ ఉదయాన్నే శివాలయాల్లో దీపారాధనకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే ఆ ఊరిలో నలుగురు యువకులు చనిపోయరని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉమ్మడి ప.గో జిల్లా తాడిపర్రులో జరిగిన విషాద ఘటన ఇది. సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణకు ఫ్లెక్సీలు కడుతుండగా ఐదుగురు యువకులు విద్యుత్ ఘతానికి గురి అయ్యారు. వీరిలో బొల్లా వీర్రాజు(26), మారిశెట్టి మణికంఠ (28), పామర్తి నాగేంద్ర(23), కాసగాని కృష్ణ(20) చనిపోయారు. ఎదిగి వచ్చిన కుమారులు చనిపోవడంతో 4 కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఒక వ్యక్తి కి చికిత్స అందజేస్తున్నారని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్..
Read Also: Eknath Shinde: సీఎంను దేశద్రోహి అని పిలిచినందుకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందే
మరోవైపు.. రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు మృతి అత్యంత బాధాకరం అన్నారు.. ప్రమాదంలో మరణించిన వారికి నా ప్రగాఢ సాుభూతిని తెలియజేస్తున్నా.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రమాద ఘటనపై విచారణ జరిపించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇక, విద్యుదాఘాత మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటాం అన్నారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు.