Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Abdul Nazeer: తూర్పు గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నేడు స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వీసీ ప్రసన్నశ్రీ తెలిపారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరానికి చెందిన పీహెచ్‌డీ, పీజీ, పీజీ డిప్లొమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు అందించనున్నారు.. గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డీలు, గోల్డ్ మెడల్స్ పట్టాలను ప్రదానం చేయనున్నారు..
గవర్నర్ పర్యటన షెడ్యూల్..
గవర్నర్ నేడు ఉదయం 9.40 గంటలకు విజయవాడలోని లోక్ భవన్ నుంచి బయలుదేరి, 10.00 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.05 గంటలకు బయలుదేరి, 10.45 గంటలకు రాజమహేంద్రవరం లోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. స్వల్ప విరామం అనంతరం ఉదయం 11.00 గంటలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చేరుకుని, అక్కడ నిర్వహించనున్న XVI & XVII సంయుక్త స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు కొనసాగనుంది. తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు యూనివర్సిటీ నుంచి బయలుదేరి, 12.20 గంటలకు తిరిగి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుని అతిథి గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా విజయవాడకు బయలుదేరి, మధ్యాహ్నం 1.40 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి, 2.10 గంటలకు లోక్ భవన్‌కు చేరుకోవడంతో గవర్నర్ పర్యటన ముగియనుంది.
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!