Teacher MLC By Election: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. ఫలితాలపై ఎవరి లెక్కలు వారివే..!
- ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..
- 93 శాతం పోలింగ్ నమోదు.. ఈ నెల 9వ తేదీన కౌంటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher MLC By Election: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మరణంతో బైఎలక్షన్ జరిగిన విషయం విదితమే కాగా.. బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్య జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు టీచర్లు బారులు తీరారు. యూనియన్ల వారీగా విడిపోయి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు మద్దతు ఇచ్చారు. ఆరు కొత్త జిల్లాల పరిధిలో ఓటర్లు.. ఎమ్మెల్సీ ఎవరు అనేది డిసైడ్ చేస్తున్నారు. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, అల్లూరి జిల్లాలో 11 మండలాల్లో ఓటర్లు ఉన్నారు.
Read Also: IND vs AUS: టాస్ గెలిచిన రోహిత్.. మూడు మార్పులతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
అయితే, పోల్ అయిన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓటు వస్తే వాళ్లు విజయం సాధిస్తారు. అలా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. గత ఎన్నికల్లో షేక్ సాబ్జీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో పీడీఎఫ్ తరఫున విజయం సాధించారు. ఈ సారి కూడా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కాకినాడ జేఎన్టీయూకు తరలించారు. ఇక, ఈ నెల 9వ తేదీన అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ జరగనుంది. కాగా, గురువారం రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన విషయం విదితమే.. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 16,737 మంది టీచర్లు ఉండగా.. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదు అయ్యింది..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!