ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మరణంతో బైఎలక్షన్ జరిగిన విషయం విదితమే కాగా.. బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్య జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు టీచర్లు బారులు తీరారు. యూనియన్ల వారీగా విడిపోయి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు మద్దతు ఇచ్చారు.