Site icon NTV Telugu

Harsha Kumar: ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తోంది

Harshakumar

Harshakumar

ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యమంత్రులకు నచ్చిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెడుతున్నారు.‌ చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరు. చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో ఎక్స్‌పర్ట్. డయాఫ్రం వాల్ కడుతున్న ప్రాంతం సరైంది కాదు. రానున్నది వర్షాకాలం.. వరదల సమయం… అంచనాలు మించి వరద ప్రవాహం ఉంటుంది. డయాఫ్రం వాల్, కాపర్ డామ్‌ల నిర్మాణం గురించి నేను ఎప్పుడో చెప్పాను. వాటి నిర్మాణం అంత సులువు కాదు.’’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Infosys: నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు.. కానీ, ఇన్ఫోసిస్ మాత్రం..

‘‘పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం ఆదమరుపుగా ఉన్న గోదావరి జిల్లాలకు పెను ప్రమాదం పొంచి ఉంటుంది. వరదల కారణంగా మరో 15 రోజుల్లో ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయి.‌ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉండదు. దానిలో సంవత్సరం అంతా నీరు అందుబాటులో ఉండదు. దానికోసం రూ.82 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటున్నారు. అక్కడ మంచి మంచి భూములు తీసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో డబ్బు దోచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.‌ బనకచర్లను కేంద్రం ఆపివేయడం పట్ల పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాను.’’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Rekha Gupta: 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం బంగ్లాకు ఎంత ఖర్చు చేస్తున్నారంటే..!

‘‘చంద్రబాబు చెప్పినట్లుగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు.‌ ప్రస్తుతం దేశంలో నడుస్తున్నది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు డబ్బులు ఇంజన్ సర్కార్. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళితే ఛీదరింపులు ఎదుర్కొంటారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు తదితర పథకాలపై ప్రజలు నిలదీస్తారు. గడిచిన ఏడాది కాలంలో చంద్రబాబు ఓటమిని ఎమ్మెల్యేలపై పెట్టాలని చూస్తున్నారు. గడచిన ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే అక్రమాలకు పాల్పడుతున్నారు. పర్యావరణ సమతుల్యత పాటించాలనే కనీస పరిజ్ఞానం చంద్రబాబుకు లేదు.’’ అని హర్హకుమార్ ధ్వజమెత్తారు.

Exit mobile version