Site icon NTV Telugu

Deputy CM Pawan: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

Pawan

Pawan

Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదారి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి.. ప్రమాదాన్ని పరిశీలించారు. ట్యాంకర్‌ను, కారును పక్కకు తీసి.. ఐదుగురి మృతదేహాలను గవర్నమెంట్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్‌తో దాడి.. చివరకి..?

అయితే, ముందు వెళుతున్న వాహనాన్ని లెఫ్ట్ సైడ్ ఓవర్ టెక్ చేసి పక్కకు రావటంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది.. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతులు రాజానగరం మండలం రఘునాథపురం, రాజమండ్రి రూరల్ కవలగొయ్యికి చెందిన రెండు కుటుంబాల వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు రేలంగి శివన్నారాయణ (40), దేవి లలిత (34), రేలింగి వర్షిత (13)తో పాటు తీగిరెడ్డి శివ (30), తీగ రెడ్డి సాన్వి(4)గా గుర్తించారు. అలాగే, తీగి రెడ్డి భవాని (26), రేలంగి హర్షిత (13) గాయపడటంతో వారిని స్థానిక హస్పటల్ కి చికిత్స కోసం తరలించారు.

Read Also: Bank Robbery: బ్యాంక్‌లో భారీ దొంగతనం.. 59 కిలోల బంగారం చోరీ..!

కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు. ఇక, ఏడీబీ రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడమైంది.

Exit mobile version