రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు. ధన ధాన్య యోజన పథకంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పప్పు దినుసులు దిగుమతి పెంచుకునేందుకు బడ్జెట్‌లో ఆలోచించారని పేర్కొన్నారు. మరోవైపు.. ఆక్వా రంగానికి, పాడి పశువులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పురంధేశ్వరి తెలిపారు.
Read Also: Israel Hamas: “హమాస్ మిలిటెంట్‌కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
పంట నష్టపోయినా.. ఇంట్లో ఉన్న పాడి పశువుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి గోకుల్ పథకం అందిస్తున్నట్లు పురంధేశ్వరి చెప్పారు. మరోవైపు.. పెట్టుబడి సేకరణకు ప్రత్యేక దృష్టి పెట్టారని, దేశంలో పెట్టుబడులు పెడితే రక్షణ ఉంటుందని తెలిపారు. పెట్టుబడులు రావడానికి మన రాష్ట్రానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచమంతా ఆర్థికమాన్యం ఎదురుకుంటున్నా.. మనదేశం 7 శాతం అభివృద్ధిలో ఉందని పేర్కొన్నారు. రోజుకు రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. మరోవైపు.. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఊరట లభించిందన్నారు. ప్రపంచానికి అవసరమైన మందులను తయారు చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉంది.. జన ఔషధ పథకం, ఆయుష్ మాన్ భారత్ పథకాలు పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పురంధేశ్వరి తెలిపారు.
Read Also: Israel Hamas: “హమాస్ మిలిటెంట్‌కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..