AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
- రెండో రోజు పెరిగిన నామినేషన్లు
- జడ్పీటీసీ స్థానాలకు 37 దరఖాస్తులు
- ఎంపీటీసీ స్థానాలకు 428 నామినేషన్లు
- జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజు అత్యంత ఉత్సాహంగా, భారీ స్పందన మధ్య కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో రాజకీయ వేడెక్కింది. రాజమహేంద్రవరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 12 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ జిల్లాలో పార్టీ గుర్తులపై జరగనున్న ఈ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
భారీగా దాఖలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు
మొత్తం 21 జడ్పీటీసీ స్థానాలకు గాను రెండో రోజు ఏకంగా 37 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు కేవలం మూడు జడ్పీటీసీ నామినేషన్లు మాత్రమే రాగా, రెండో రోజు నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటిలో టీడీపీ నుంచి 13, వైఎస్సార్సీపీ నుంచి 13, జనసేన నుంచి ఆరు, కాంగ్రెస్ నుంచి రెండు, బీజేపీ నుంచి రెండు , బీఎస్పీ నుంచి రెండు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు 412 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తొలి రోజు 200 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, రెండో రోజు ఏకంగా 428 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు.
Also Read
- Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
- Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
- Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
- AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
ఉత్కంఠ రేపుతున్న జడ్పీ చైర్మన్ పీఠం..
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అధికార కూటమిలో జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా సీతానగరం జడ్పీటీసీ స్థానం నుంచి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి బరిలో నిలవడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ తరఫున గట్టి పోటీ ఇచ్చేందుకు అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. ఈ వ్యూహాల్లో భాగంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితర నేతలు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ నామినేషన్ల ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
-
Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
-
Telangana SSC Exams : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే.?
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
ట్రెండింగ్
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!