Site icon NTV Telugu

Duvvada Haindavi: మా డాడీ మాకు కావాలి..

Duvvdsa Sin

Duvvdsa Sin

Duvvada Haindavi: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె.. హైందవి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మాకు మా డాడి కావాలి.. మేం మా నాన్నతోనే ఉండాలను‌కుంటున్నామన్నారు. మా నాన్నకు చాలా సార్లు చెప్పాం.. మా మంచి చెడు డాడీకి తెలుసు.. ఆయన మరో మహిళ ట్రాప్ లో పడ్డారు.. దివ్వల మాదురి మా కుటుంబంలో చిచ్చు పెట్టింది అని ఆమె ఆరోపణలు చేసింది. మాకు రాజకీయాలకంటే కుటుంబం మంచిది.. మా డాడి పొలిటికల్ పవర్ వాడుకోవాలని దగ్గరైంది అంటూ దువ్వాడ హైందవి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Karnataka Accident : నిండు గర్భిణిని ఢీకొట్టిన లారీ.. రోడ్డు పైనే ప్రసవించిన మహిళ.. కానీ

ఇక, దువ్వాడ శ్రీను భార్య వాణి మాట్లాడుతూ.. బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించాను.. ఒక క్యారెక్టర్ లేని వ్యక్తితో దువ్వాడ అక్రమ సంబంధం పెట్టుకోవడం చాలా బాధంచింది.. దువ్వాడ శ్రీనివాస్ చేసిన పనితో తమ పిల్లలు భవిష్యత్త్ అంధకారంలోకి వెళ్లిపోయింది.. మేం దువ్వాడను ఇంటి నుంచి పంపించలేదు.. పలాసలో కూడా తమ పిల్లలపై ఇబ్బందికరంగా దువ్వాడ బ్రదర్స్ ప్రవర్తించారు అని ఆమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు తన పిల్లలు తండ్రితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం.. ఇటీవల ఎన్నికల్లో కనీసం దువ్వాడ శ్రీనివాస్ గెలవాలనే పోటీకి దూరంగా ఉన్నాను అని దువ్వాడ వాణి పేర్కొనింది.

Exit mobile version