NTV Telugu Site icon

Dharmana Krishna Das: వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కాకపోతే.. గెలిచినా రాజీనామా చేస్తా

Dharmana Krishna Das

Dharmana Krishna Das

Dharmana Krishna Das: శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వైసీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జగన్ మరోసారి సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు.

Read Also: Andhra Pradesh: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండానే అన్ని స్థానాలకు పోటీ చేస్తారని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. పొత్తులు లేకుండా టీడీపీ, జనసేన 175 స్థానాల్లో పోటీ చేయగలవా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయాలని జగన్ ఆకాంక్షిస్తున్నారని.. అందుకే వికేంద్రీకరణ లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. టీడీపీ, జనసేన కేవలం 25 గ్రామాల ప్రజల కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు రాజధానులు పెట్టాలని జగన్ ఆలోచిస్తుంటే పవన్ మాత్రం టీడీపీకి వంతపాడుతున్నారని .. రాజకీయం అంటే సినిమా కాదని పరిణితి కావాలని పవన్‌ను ఉద్దేశించి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలు చేశారు.

Show comments