Tirumala: టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఆదివారం నాడు పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన అదనపు ఈవోగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈవో పదవితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న జవహర్‌రెడ్డిని ఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగించారు. అనంతరం ధర్మారెడ్డి టీటీటీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగానూ ప్రమాణం చేశారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇటీవల తీవ్రమైన ఇబ్బందులు పడడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జవహర్‌రెడ్డిని ఈవోగా రిలీవ్ చేస్తూ ఆయన స్థానంలో ధర్మారెడ్డికే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రోజూ 70 వేల నుంచి లక్ష మంది భక్తులు కొండకు వస్తున్న నేపథ్యంలో ఈవో నిరంతరం అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టే అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారు.
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
Ambati Rambabu: జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా?
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..