రివర్స్ టెండరు పై విచారణ జరిగితే జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమా వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలవరం అధారిటీ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారని, రివర్స్ టెండరుపై విచారణ జరిగితే జగన్ జైలుకి వెళ్తారన్నారు. అయితే.. ఉభయ గోదావరి జిల్లా వాసులకు ముందస్తు సమాచారం లేకుండా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. పేదప్రజలు పశువులు కొట్టుకు పోయాయని, ఇళ్ళు, డబ్బు, వస్తువులు వదులుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండలు, గుట్టలు ఎక్కి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవల్సిన పరిస్థితి వొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ బారికేడ్లు కట్టుకుని, కార్డ్ లు ఇచ్చి పరామర్శలు చేసిన దుస్థితిలో ఉన్నారని అన్నారు.
read also: Dulquer Salmaan: మహానటి ప్రొమోషన్ కు అందుకే రాలేదు..
ధవలేశ్వరం ఎస్.ఈ ఎందుకు సెలవు పై వెళ్లారని ప్రశ్నించారు. వరదలు ముంచెత్తుతున్నాయని, వరదలు వొచ్చే సమయంలో డ్రేజింగ్ కాంట్రాక్ట్ పై దృష్టి పెట్టాలని, వరద సమయంలో డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ ముఖ్యమా.. లేక లంక ప్రజల ప్రాణాలు ముఖ్యమా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. కాగా.. గత మూడు ఏళ్ల లో వరద సాయం ఇస్తా అన్నారు, మరి ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాలుగు రోజుల పర్యటన చేశారని, మరి.. ఆ ప్రాంతాల్లో సీఎం రెండు రోజుల పర్యటన చేయగలరా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షలకోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లడం.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పది శాతం వాటా చెల్లించలేని దుస్థితిలో వైసీపీ సర్కార్. అదనపు నిధులు సాధించుకోవాల్సింది పోయి.. ఇచ్చిన నిధులను వెనక్కి పంపిన వైనం. J-టాక్స్ దోపిడీతో సొంత ఖజానా నింపుకుందని విమర్శిస్తూ ట్వీట్ వేదికగా మండిపడ్డారు.
లక్షలకోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లడం.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. పది శాతం వాటా చెల్లించలేని దుస్థితిలో వైసీపీ సర్కార్. అదనపు నిధులు సాధించుకోవాల్సింది పోయి.. ఇచ్చిన నిధులను వెనక్కి పంపిన వైనం. J-టాక్స్ దోపిడీతో సొంత ఖజానా నింపుకున్న @ysjagan రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు. pic.twitter.com/5TbJGct1uZ
— Devineni Uma (@DevineniUma) July 31, 2022