Site icon NTV Telugu

AP DGP: మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..

Ap Dgp

Ap Dgp

AP DGP: రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 34 శాతం పెరిగింది.. గంజా కేసులు 3 శాతం పెరిగాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. 97,760 గత సంవత్సరం రిపోర్ట్ అయిన క్రైమ్స్.. ఈ సంవత్సరం 92,094 క్రైం రిపోర్ట్ అయ్యాయి.. ఓవరాల్ క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇక, దొంగతనం, దోపిడీ కేసులు 0.2 శాతం పెరిగాయి.. మహిళల పట్ల జరిగిన క్రైంలు 10 శాతం తగ్గాయని ఆయన సూచించారు. మహిళల హత్యలు మాత్రమే 20 శతాం పెరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల నేరాలు కూడా 4.9 శాతం తగ్గాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

Read Also: UP : చపాతీలు లేటుగా పెట్టారని పెళ్లి నుంచి వెళ్లిపోయి వేరే అమ్మాయిని చేసుకున్న వరుడు

అలాగే, మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు అని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పుకొచ్చారు. ప్రతీ జిల్లాకి ఒక సైబర్ క్రైం పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయడానికి సీఎం నిర్ణయించారు.. బ్యాంకర్లు కూడా అధిక మొత్తంలోని లావాదేవీల విషయంలో కస్టమర్లతో మాట్లాడితే పెద్ద నేరాలు జరగకుండా ఆపొచ్చని సూచించారు. ఇక, 10, 837 ఎకరాల్లో గంజాయికి మారు పంటలు కూడా వేయించాం.. అలాగే, డ్రోన్లు వినియోగంలో ఆధునికతను పెంచుతున్నాం.. 173 డ్రోన్లను వినియోగిస్తున్నాం.. మనిషి వెళ్ళలేని చోట డ్రోన్లు వాడుతున్నామని వెల్లడించారు. కార్తీక మాసంలో డ్రోన్ల వల్లే బాపట్లలో ముగ్గురిని కాపాడాం.. విజయవాడ ట్రాఫిక్ కంట్రోల్ కి డ్రోన్ వినియోగిస్తున్నామని డీజీపీ తిరుమలరావు పేర్కొన్నారు.

Read Also: Deputy CM Pawan Kalyan: అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు..

అయితే, ఏపీ, తెలంగాణాల్లోనే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం అమలులో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు చెప్పారు. AIను విదేశీ వ్యక్తులు, వేరే భాష వాళ్ళు ఉన్న కేసుల్లో వినియోగిస్తాం.. AI VijayASTram అనేది ప్రస్తుతం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కు విజయవాడలో వినియోగిస్తున్నారు.. సీసీ టీవీలు ప్రతీ చోటా ఉండాలి… నేరం జరిగిన విజువల్స్ కచ్చితంగా రికార్డు కావాలి.. సీసీ టీవీ కెమెరాలు విస్తృతంగా పెంచుతున్నామన్నారు. త్వరలోనే లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు, AI ద్వారా స్మార్ట్ పోలీసింగ్ చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే, పోలీసు వెల్ఫేర్ కి రూ. 20 కోట్లు సీఎం ఇటీవల ఇచ్చారు.. 189 సీనియర్ లెవెల్ ప్రొమోషన్లు ఇచ్చాం.. AFORCE ప్రస్తుతం ఆపరేషన్ లో ఉంది.. జత్వానీ కేసులో కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి చర్యలు తీసుకుంటారు.. మాజీ ఆర్మీ ఉద్యోగి ASP గా పవన్ కళ్యాణ్ పర్యటనలో తిరగలేదు.. ఆ వ్యక్తి శిలాఫలకం దగ్గర ఫోటోలు దిగాడని డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు.

Exit mobile version