వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఎం నేత పి. మధు.. ఏపీలో తాజాగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీపీఐ నేత రామకృష్ణ తదితర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ చార్జీలు పెంచారని మండిపడ్డారు.. ఆఖరికి పల్లెవెలుగుని కూడా వదలలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు.. ఇక, కేంద్రం డీజిల్, పెట్రోల్ తో దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లకాడు చేస్తుంది.. ప్రజా ఉద్యమాలకు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఇది మా ఆఖరి వర్నింగ్.. రెండు రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం… వాళ్లు దిగిపోతే మేం వస్తాం అంటున్నారు తప్ప జనసేన, టీడీపీ ప్రజా సమస్యలపై స్పందించడం లేదని మండిపడ్డారు పి. మధు.
Read Also: LIVE: హైదరాబాద్‌లో కాషాయ సంబరాలు
ఇక, ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ పది వామపక్షాలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి కూడా అధిక భారాలు మోపుతుంది ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. అధికారంలో రాక ముందు కరెంట్ చార్జీలు పెంచనని ఇప్పుడు పెంచుతూనే వున్నారు.. అన్ని ధరలు పెంచుతూ జగన్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో ఉద్యమం చేస్తామని ప్రకటించారు.. త్వరలో రాష్ట్ర బంద్ చేస్తాం, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు రామకృష్ణ. కాగా, ఏపీఎస్ఆర్టీసీ మరోసారి బస్సు చార్జీలను వడ్డించిన విషయం తెలిసిందే.. దీనిపై భగ్గుమంటున్నాయి విపక్షాలు.. ముఖ్యంగా వాపక్షాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి.. అందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి లెఫ్ట్ పార్టీల శ్రేణులు.