డిస్కంలు వసూలు చేసిన విద్యుత్ ట్రూ అప్ చార్జీలను వినియోగదారులకు వెనక్కు ఇవ్వాలని ఏపీఈఆర్సీ ఆదేశం జారీ చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను డిసెంబర్ నెల బిల్లుల్లో తగ్గించేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వెనక్కు ఇవ్వడమనేది ప్రజా విజయం అని సీపీఎం నేత సీహెచ్ బాబురావు అన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ట్రూ అప్ ఛార్జీలను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశారు. రూ. 7వేల కోట్ల మేర ట్రూ అప్ ఛార్జీల భారంపై ఈఆర్సీ విచారణ చేపడుతోంది. ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై పడే ప్రమాదం ఉంది అని తెలిపారు. ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేయాలన్న డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించాలి. చౌకగా విద్యుత్ కొనుగోలు చేస్తున్నప్పుడు ఛార్జీలు తగ్గాల్సింది పోయి.. ఎలా పెరుగుతాయి అని ప్రశ్నించారు.