Site icon NTV Telugu

CPI Ramakrishna: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తాం..

Ramakrishna

Ramakrishna

CPI Ramakrishna: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ మార్కెట్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదు అన్నారు. కూటమి ఇచ్చిన హామీలను త్వరలో నెరవేర్చకపోతే.. వామపక్ష భావాలు ఉన్న పార్టీలను కలుపుకుని ఉద్యమం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు.

Read Also: Minister Narayana: రాజధాని నిర్మాణానికి మరో 40 వేల ఎకరాలు కావాలి..

అయితే, అర్హులైన పేదవారికి పట్టణంలో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాగే, రైతులకు 20 వేల రూపాయల రైతు భరోసా కింద వెంటనే డబ్బులు చెల్లించాలి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందచేయాలి అని కోరారు. రూ.82 వేల కోట్లతో గోదావరి- బనకచర్ల నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం గురించి చంద్రబాబు మాట్లాడటం భావ్యం కాదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

Exit mobile version