ఏపీలో అధికారమే పరమావధిగా బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. బీజేపీ తీరుపై అటు అధికార వైసీపీ, విపక్షంలో వామపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా సీపీఐ నేత రామకృష్ణ తీవ్రవ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాలు రెండు లక్షల మంది పోలవరం నిర్వాసితుల్ని ముంచేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఇవ్వాల్సిన 28వేల కోట్ల రూపాయల విషయంలో సి.ఎం జగన్ చేతులెత్తేశారు. వైసీపీ ఎంపీలు చదువుకున్న వారు, డబ్బు ఉన్నవారు, వైసీపీ ఎంపీలు దద్దమ్మల్లా ఢిల్లీలో తిరిగే బదులు రాజీనామా చెయ్యాలి.
Sai Pallavi: షాకింగ్ ప్రచారం.. అదే నిజమైతే అంతే సంగతులు!
ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదో అందరం కలసి పోరాటం చేద్దాం.. రేపు పోలవరం ప్రాజెక్టును సీపీఐ బృందం సందర్శిస్తుంది.. పోలవరం నిర్వాసితుల కోసం అన్ని పక్షాలతో కలసి ఉద్యమిస్తాం. అమరావతిలో బీజేపీ పాదయాత్ర పక్కాడ్రామా అన్నారు రామకృష్ణ. సోము వీర్రాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఒక్క ఫోన్ చేయిస్తే జగన్ లేచినిలబడతారన్నారు రామకృష్ణ. బీజేపీ, వైసీపీలు లాలూచీ రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. సీ.ఎం జగన్ వైఖరితో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు.
Vijaya Sai Reddy: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రికి సూటి ప్రశ్న.. కార్పొరేట్ కంపెనీల టాక్స్ ఎగవేతపై చర్యలేవి?