CPI Ramakrishna: పేరు మార్చే అధికారం జగన్‌కు ఎవరిచ్చారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహోన్నతుల పేర్లు మార్చే అధికారం ఎవరు ఇచ్చారని సీసీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీలో బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం తగదన్నారు. అంతగా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని జగన్ భావిస్తే కొత్త యూనివర్సిటీలు నిర్మించి వాటికి పెట్టుకోవాలని సూచించారు. జగన్ నిర్ణయం ముమ్మాటికీ తుగ్లక్ చర్య అని సీపీఐ నేత రామకృష్ణ అభివర్ణించారు. గత మూడేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క యూనివర్సిటీ అయినా జగన్ కట్టారా అని ఆయన నిలదీశారు.
Read Also:Krishnam Raju: కృష్ణంరాజు బతికే ఉన్నారు.. మీరే చూడండి
Also Read
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
అటు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలలో సరైన సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. జగన్ ఈ విషయాన్ని గాలికొదిలేశారని సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి ఆయన పేరే కొనసాగించాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సూచించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమని.. అదే జిల్లాలో ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆ మహనీయుడి పేరే కొనసాగించాలని వల్లభనేని వంశీమోహన్ కోరారు. అటు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరుమార్పును వ్యతిరేకిస్తూ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అనుకుని ఉంటే వైఎస్ఆర్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంత ప్రమాదకరమో జగన్‌కు అర్థంకావడం లేదని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?