కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీపీఐ పాదయాత్ర వాయిదా పడిందని ఆ పార్టీ కార్యదర్శి నారాయణ చెప్పారు. సైక్లోన్ మాండోప్ ప్రభావం, వర్షం కారణంగా పాదయాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం అన్నారు. రాజకీయాలపై పోరాటం చేయగలం ప్రకృతిపై చేయలేం. ప్రజల నుంచి పాదయాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరులో బిజెపి, వైసిపి మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. త్వరలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం చలో రాయలసీమ నిర్వహిస్తాం అన్నారు. ఉమ్మడి పౌరసత్వ బిల్లును సీపీఐ వ్యతిరేకిస్తోందన్నారు.
ఉమ్మడి పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే దేశం ఒక్కటిగా ఉండదు. ఉమ్మడి పౌరసత్వ బిల్లు పై సిఎం జగన్ తన వైఖరి ప్రకటించాలి. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశంపై సిఎం జగన్ పెదవి విప్పాలి. తన ఓటు బ్యాంకు పైనా సిఎం దృష్టి సారించాలి. టి ఆర్ ఎస్ బి ఆర్ ఎస్ గా మారడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. బిజెపి కి వ్యతిరేక శక్తులతో బి ఆర్ ఎస్ కలుస్తుందా లేదా అనే దానిపై మా వైఖరి ఉంటుంది. ఈ నెల 29న సీపీఐ జాతీయ సమావేశాలు నిర్వహిస్తాం అన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
Read Also: Team India: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టెస్ట్ జట్టులో ఉనద్కట్‌కు చోటు
ఈ నెల 29న దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం అన్నారు. వచ్చే ఫిబ్రవరి 24 నుంచి 26వరకు పుదిచ్చేరిలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై కార్యవర్గంలో చర్చిస్తాం అన్నారు నారాయణ. దేశంలో బిజెపి హవా అనేది గాలివాటం. బిజెపి వ్యతిరేక ఓటు చీలికతో ఆ పార్టీ గెలుస్తోందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఓటమికి బిజెపి అధ్యక్షుడు పై కాకుండా మోదీపై ఆ పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు నారాయణ.
Read Also: Top Headlines @5 PM: టాప్ న్యూస్