NTV Telugu Site icon

నిర్లక్ష్యం, స్వార్థం వల్లే విద్యుత్ సంక్షోభం.. మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలి..

Narayana

Narayana

ప్రధాని నరేంద్ర మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ చేతకానిపాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని ఆరోపించారు.. కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారు… సీసీ కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా..? జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా..? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.

ఇక, నరేంద్రమోడీ పంచభూతాలను అమ్మేస్తున్నారని విమర్శించారు నారాయణ.. దేశ సంపద మొత్తాన్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారన్న ఆయన.. మాదకద్రవ్యాల సరఫరా దేశంలో విచ్చలవిడిగా జరుగుతోందన్నారు.. మాదకద్రవ్యాల సరఫరాలో ఏపీ ప్రభుత్వ పాత్ర ఉందని వ్యాఖ్యానించిన ఆయన.. కేంద్రం కనుసన్నల్లో వైఎస్‌ జగన్ పనిచేస్తూ.. ఏపీలో మాదకద్రవ్యాల సరఫరాకు సహకరిస్తున్నారని ఆరోపించారు.. ప్రధాని మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌ చేసిన నారాయణ.. నిర్లక్ష్యం, స్వార్థం వల్ల విద్యుత్ సంక్షోభం వచ్చిందని.. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.