కరోనాకు చెక్ పెట్టేందుకు రకరకాల వ్యాక్సిన్లతో పాటు.. కొత్త వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల చికిత్సలో కొత్త ఇంజక్షన్ ప్రయోగం ప్రారంభించారు.. కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగించారు.. విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగించారు… సెలైన్ ద్వారా అరగంట వ్యవధిలో బాధితుడికి కాక్ టెయిల్ ఇంజక్షన్ అందజేసిన వైద్యులు.. ఆ తర్వాత కరోనా బాధితుడిని ఇంటికి పంపించారు.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయని ఆయుష్ వైద్యులు చెబుతున్నారు..
ఈ యాంటిబాడీ మందు ల్యాబ్ లో తయారు చేసిన యాంటిబాడీ, ప్రొటీన్ యొక్క సమ్మేళనం.. ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటిన్‌ని నిరోధించడం ద్వారా వైరస్ కణాలను ఎదుర్కొంటుంది. అంతేకాదు.. మానవ కణం మీద వైరస్ ప్రభావం చూపకుండా అడ్డుపడుతుంది.. ఈ ఇంజెక్షన్ ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు వైద్యులు.. 12 ఏళ్లు పైబడిన వారికి 40 కిలోల బరువు పైన మరియు స్ధూల కాయులు, 65 ఏళ్లు పైబడిన వారు కూడా వాడవచ్చు.. కిడ్నీ వ్యాధి, లివర్ వ్యాధి, కంట్రోల్ లేని షుగర్ వ్యాధి మొదలైన వారికి కూడా ఈ యాంటిబాడి ఇంజెక్షన్ కరోనా వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్టు తేలింది.. ఈ యాంటి బాడీ మిశ్రమాన్ని పేషెంట్ రక్తనాళం ద్వారా సెలయెన్ లో కలిపి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు.. ఇప్పటికే ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.