Site icon NTV Telugu

Selfie Video: దువ్వాడలో దంపతుల సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం..

Selfie Video

Selfie Video

Selfie Video: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలు సూసైడ్ వీడియో కలకలం రేపింది.. వడ్లపూడి తిరుమల నగర్ లో నివాసముంటున్న చిత్రాడ వరప్రసాద్ భార్య మీరా గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.. భర్త చిత్రాడ వరప్రసాద్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు.. భార్య మీరా తో కలిసి ఓ సెల్ఫీ వీడియో తీసి.. కుమారుడు కృష్ణ సాయి తేజకు వాట్సాప్ పంపించాడు.. ఇక, ఆ తర్వాత సెల్‌ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేశారు.. తల్లి తండ్రుల వీడియో చూసి ఆందోళనకు గురైన కుమారుడు కృష్ణ సాయి తేజ.. పోలీసులను ఆశ్రయించాడు.. దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక, కృష్ణ సాయితేజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అనకాపల్లి ఏటికొప్పాక ఏలూరు కాలువ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఉన్నట్లు గుర్తించారు.. ప్రస్తుతానికి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఎక్కడికైనా వెళ్లిపోయారా? లేదా? ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Read Also: Today Business Headlines 28-03-23: డిఫాల్టర్ల వాదన విన్నాకే నిర్ణయం తీసుకోవాలి. మరిన్ని వార్తలు

Exit mobile version