ఏపీలో కరోనా కేసులు ఇప్పటికి భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ చాలా కురంభల్లో విషాదం నింపింది. ఇక తాజాగా గుంటూరులో మరో దారుణం చితి చేసుకుంది. తల్లికడుపులో ఉండగా కరోనా సోకిన చిన్నారి మృతి చెందింది. గత నెల 30న నర్సరావుపేటలో మహిళ కరుణ డెలివరీ అయ్యింది. అయితే ఆ చిన్నారి అనారోగ్యంతో ఉండడంతో గుంటూరుకు తరలించారు. రక్తం గడ్డకట్టి పేగు కుళ్లినట్లు గుర్తించిన వైద్యులు… ఆపరేషన్ చేసి దెబ్బతిన్న పేగును తొలగించారు. కానీ ఆపరేషన్ చేసిన రెండు వారాల తర్వాత అనారోగ్యంతో చిన్నారి మృతి చెందింది.