కరోనా తగ్గుముఖం.. జులై 19 తరువాత అన్ని ఆంక్షలు ఎత్తివేత

కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో పూర్తి స్థాయిలో అన్‌లాక్‌ చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 19 తరువాత ఆంక్షలన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తోంది బోరిస్‌ సర్కార్‌. గత ఏడాదిగా కాలంగా కరోనా మహమ్మారితో విలవిల్లాడిన యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ముఖ్యంగా కరోనా పుట్టాక పలు వేరియంట్లతో వణికిన బ్రిటన్‌లో.. ఇప్పుడు కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో అన్నింటిని ఓపెన్‌ చేసేందుకు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

read also : LIVE : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

మరోవైపు వైరస్‌ అదుపులోకి వచ్చింది. దీంతో ఏడాది కాలంగా కొనసాగుతన్న ఆంక్షలను జులై 19 తరువాత ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ వాడకం విషయంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వేగంగా అమలు చేస్తున్న వ్యాక్సిన్ విధానం స‌త్ఫలితాలు ఇస్తుండటంతో.. మాస్క్ వాడాలా వద్దా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భౌతిక దూరం పాటించడంతో పాటుగా పలు రకాల నిబంధనలు ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లుగా అక్కడి మీడియా చెబుతోంది. జిమ్‌, రెస్టారెంట్స్‌, మ్యూజియంలలో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిబంధ‌న‌ల‌ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-