D. Raja Warns RSS: విజయవాడలో సీపీఐ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మీట్ ది ప్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాలలో NDA రావడంపై ఇప్పటికే ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఏపీలో, పార్లమెంట్ లో చంద్రబాబు, జగన్ ల వల్ల మాత్రమే మోడీ ఉన్నారని అన్నారు. లెఫ్ట్ పార్టీలు కలిసి కట్టుగా పని చేయాలని కోరారు. SIR ప్రధాన సమస్యగా మారిందన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా బ్లాక్ తమ లోపాలను బేరీజు వేసుకోవాలని సూచించారు.
Read Also: Kajol & Twinkle : “ఇద్దరం ఒక్కరినే డేట్ చేశాం” – బోల్డ్ కామెంట్స్‌తో షాక్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీస్!
ఇక, బ్రిటీష్, ఫ్రెంచ్ లాంటి కలోనియలిజంలపై మా పార్టీ పోరాడింది అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. స్వతంత్ర్య ఉద్యమంలో RSS పాత్ర అసలు లేదు.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు చాలా యాక్టివ్ గా మారింది.. RSS కు ఒక రిజిస్ట్రేషన్ కానీ, నిబద్ధత, బాధ్యత కానీ లేవు.. మా పార్టీ కి రిజిస్ట్రేషన్ ఉంది.. మాకు బాధ్యత, నిబద్ధత ఉన్నాయని పేర్కొన్నారు. ఇక, RSS మన రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని అంగీకరించలేదు.. ఆ సంస్థది ఒక మతతత్త్వ విధానం.. రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ తో హాని పొంచి ఉందన్నారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం కలిపితేనే న్యాయంగా పరిగణిస్తాం.. పార్లమెంట్ మన దేశంలో వంద రోజులు పని చేయడం లేదు.. రూపాయి విలువ పడిపోతే, ఇక భారత ఆర్థిక పరిస్ధితి బాగున్నట్టు ఎలా చెప్తారని ప్రశ్నించారు. భారతదేశాన్ని కట్టడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఎవరని అడిగారు.. అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంటు కూడా ప్రైవేటుపరం అయ్యేలా ఉందని డీ. రాజా ఆరోపించారు.
Read Also: IND vs Sa Test: రెండో ఇన్సింగ్స్లో చేత్తులెత్తేసిన సఫారీలు.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
అయితే, బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. వాటిపై పలు అనుమానాలు ఉన్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. బర్త్ సర్టిఫికేట్ లాంటివి గత రోజుల్లో లేవు.. వాటి ద్వారా ఓట్లు లక్షల్లో తగ్గించారు.. ఎలక్షన్ కమీషన్ పై ఇప్పుడు నమ్మకం పోయింది.. ఎన్నికల అధికారిని ప్రధాని మంత్రి నియమించుకోవడానికి బీజేపీ నిర్ణయించేసింది.. ఎలక్ట్రోరల్ బాండ్లను మా పార్టీ సహా చాలా పార్టీలు వ్యతిరేకించాయి.. కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు తీసుకున్న ఏకైక పార్టీ బీజేపీ.. బీహార్ లో కొత్త ప్రభుత్వం ఎంత వరకూ పని చేస్తుందో చూడాలి అన్నారు. బీహార్ లో ఎన్డీయే గెలుపును ఇండియా బ్లాక్ పార్టీలకు నిరాశ కలిగించిందన్నారు. ఎన్నికల్లో ఇండియా బ్లాక్ తమ లోపాలను బేరీజు చేసుకోవాలని సూచించారు. అలాగే, రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.. తమిళనాడు, బెంగాల్, కేరళలలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.. బెంగాల్ తమ తదుపరి టార్గెట్ అంటూ మోడీ చెప్పారు.. లెఫ్ట్ పార్టీలు అన్నీ ఒక మాట మీద పని చేయాలని కోరారు. లెఫ్ట్ పార్టీలు కలిసి కట్టుగా పని చేస్తేనే బీజేపీపై పోటీ చేయగలమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వెల్లడించారు.