Chinta Mohan: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఏపీ కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. కాపు ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలిపారు. 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. 100 స్థానాల్లో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రోజు రోజుకు ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతుందని చింతా మోహన్ ఆరోపించారు. ప్రజలు ప్రాంతీయ పార్టీలను నమ్మడం లేదన్నారు. రాష్ట్రానికి వైసీపీ, టీడీపీ తీరని ద్రోహం చేశాయన్నారు.
Read Also: Rajamouli: గోల్డెన్ గోల్డ్ అవార్డ్స్ ఈవెంట్ లో #RRR2 లీక్ ఇచ్చిన జక్కన్న…
ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదని చింతా మోహన్ అన్నారు. అటు 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఏపీకి చేసిందేమీ లేదన్నారు. తొక్కిసలాటలతో జనాన్ని చంపడం తప్ప ఆయన ఏం చేశారని చింతా మోహన్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తప్పు అని.. అయితే మనిషి తప్పు చేయడం సహజమన్నారు. ప్రస్తుతం ప్రజలు విభజన గాయం మరిచిపోయారని చింతా మోహన్ అన్నారు. ప్రస్తుతం ధరలు, నిరుద్యోగంతో బాధ పడుతున్నారని చింతా మోహన్ అన్నారు. దేశంలో అసమానతలు పెరిగి పోతున్నాయని.. పేదవారు మరింత పేదరికంలో మగ్గుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.