రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
YSR Law Nestham: రాష్ట్రంలోని లాయర్లకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకుంటున్నవారికి వైఎస్సార్ లా నేస్తం కింద ఆర్థిక సాయం అందజేస్తుండగా.. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ మొత్తాన్ని అందించనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది న్యాయవాదులకు లబ్ది చేకూరనుంది.. అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో బుధవారం రోజు అంటే ఈ నెల 22వ తేదీన రూ. 1,00,55,000 ను వర్చువల్…